KDP: పులివెందుల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో కొత్త రూముల వీధి 3వ లైన్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా చేతికందే ఎత్తులో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధిలోకి వెళ్లే మార్గంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చేతికందే ఎత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్


