హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో బక్కి వెంకటయ్య పూజలు

GDWL: అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల విశిష్టతను పూజారులు ఆయనకు వివరించారు.