BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లిలోని 5వ వార్డులో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. వార్డు మెంబర్ కాడపాక రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను సర్పంచ్ సునీత-రవీందర్, ఉపసర్పంచ్ రాజేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాజేందర్ మాట్లాడుతూ..వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో 6వ వార్డు మెంబర్ సురేష్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం: రాజేందర్


