హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ భద్రత పాటించాలి.. విద్యుత్ శాఖ ఏఈ

KMR: గణేశ్ శోభాయాత్ర సందర్భంగా యువజన సంఘాల సభ్యులు విద్యుత్ భద్రత చర్యలు పాటించాలని బిక్కనూర్ విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నాణ్యతలేని విద్యుత్ వైర్లు వినియోగించవద్దని తెలిపారు. విద్యుత్ మెయిన్ లైన్‌ల నుంచి నేరుగా కరెంట్ తీసుకోవద్దని, ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.