NGKL: అచ్చంపేట మండలం చందాపూర్ మాజీ సర్పంచ్ బీజ్జుల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతితో చందాపూర్‌లో విషాదం నెలకొంది. పలువురు నాయకులు సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్ కన్నుమూత


