హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

SDPT: కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్యాల శ్రీనివాస్ రెడ్డిని నియమించినట్లు మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని కోరారు.