GDWL: అలంపూర్ పట్టణంలోని గాంధీ చౌక్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. గతంలో విస్తరణ పనులలో భాగంగా స్థానిక గాంధీ విగ్రహాన్ని తొలగించారు. పట్టణవాసులు ఇటీవల అధికారులను కలిసి ఇదే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అధికారులు స్పందించి ఇవాళ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తపరిచారు.
తెలంగాణ
గాంధీ విగ్రహాం ఏర్పాటు


