GDWL: మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నేడు గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు.
తెలంగాణ
'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి'


