WNP: మున్సిపల్ అధికారుల సమయపాలనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయ సమయం దాటినా పలువురు అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
సమయపాలన పాటించని మున్సిపల్ అధికారులు


