హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదేళ్లుగా పెన్షన్‌కు దూరమైన దివ్యాంగుడు

VKB: కోట్‌పల్లి గ్రామానికి చెందిన ఎండీ వాహీద్ మియా పక్షవాతంతో పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఆసరా పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ పొందేందుకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పలుమార్లు వెళ్లినా రిపోర్టుల పేరుతో తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి సదరం సర్టిఫికెట్ జారీ చేసి, అర్హత మేరకు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని కోరాడు.