హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెల్లని చెక్కు కేసులో మహిళకు జైలుశిక్ష

KMM: ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు చెల్లని చెక్కు కేసులో వి.దీప్తి శశికళారాణికి 6 నెలల జైలుశిక్ష విధించింది. 2017లో ఎం.వెంకటేశ్వరరావు వద్ద రూ.3 లక్షలు రుణం తీసుకున్న ఆమె 2019లో రూ.4.44 లక్షల చెక్కు ఇచ్చారు. చెక్కు నగదు లేక బౌన్స్‌ కావడంతో వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జైలుశిక్షతో పాటు రూ.4.44 లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి బెక్కం రజని తీర్పునిచ్చారు.