AKP: అనకాపల్లి జిల్లా కే.కోటపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. మైనర్లైన డొంగల సత్యసాగర్, షీలా అరుణ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ నూతిలో దూకి మృతి చెందినట్లు తెలుస్తోంది. సత్యసాగర్ రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రేమ జంట ఆత్మహత్య!


