హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌కు గంగారం కళాకారుడి ఎంపిక

MHBD: బీహార్‌లోని శివాన్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌కు గంగారం మండలానికి చెందిన కళాకారుడు చుంచ కుమారస్వామికి ఆహ్వానం లభించింది. తక్షశిల కలెక్టివ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం బీహార్‌కు బయలుదేరారు.జాతీయ స్థాయిలో తన కళకు గుర్తింపు లభించడం గర్వంగా ఉందని కుమారస్వామి తెలిపారు. పలువురు అభినందనలు తెలిపారు.