హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 1.78 లక్షలకు గణనాథుని లడ్డూ వేలం

సత్యసాయి: పుట్టపర్తిలోని ఎస్.బి.ఐ రోడ్డులో ఉన్న శ్రీ సింధూర వినాయక అసోసియేషన్ వద్ద వినాయక లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. ఈ వేలంలో ముకుంద అనే మహిళ రూ. 1,78,000 కు లడ్డూను దక్కించుకున్నారు. స్వామివారి లడ్డూను సొంతం చేసుకోవడం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.