హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అభివృద్ధికి సహకరించని కమిషనర్‌ను తొలగించాలి'

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సహకరించకుండా మున్సిపల్ కమిషనర్ అడ్డుపడుతున్నాడని 2వ వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి తిరుమల భర్త కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కౌన్సిలర్ చెప్పిన పనులు చేస్తున్న సిబ్బందికి మెమోలు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే కమిషనర్‌ను తొలగించాలని మంత్రి వివేక్‌ను కోరారు.