హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలం మార్పు

KMR: బిక్కనూరు మండల కేంద్రంలో నిర్మించాలనుకున్న యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలాన్ని అధికారులు మార్చారు. తొలుత బిక్కనూరులో పాఠశాల నిర్మించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్ణయించి స్థల పరిశీలన చేపట్టారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో పాఠశాల ఉండాలన్న ఉద్దేశంతో కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.