హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రు తండాలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

WGL: ఖానాపురం మండలం భద్రు తండా గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై శిబిరం నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ భద్రు, భాస్కర్ స్థానికులకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ మొదలగు సీజనల్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.కార్యక్రమంలో ANM వినోద, ప్రతిభ, రమ తదితరులున్నారు.