హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 21వ వార్డులో భారీ కొండచిలువ కలకలం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని 21వ వార్డులో ఆగ్రసేన్ భవనం సమీపంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులోకి శుక్రవారం కొండచిలువ దూరింది. దీంతో ఇంటివారు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు, పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలేశారు.