హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంకుమ అలంకరణలో స్వామివారు

AKP: చోడవరం పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని కుంకుమ అలంకరణతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణలో భక్తులకు వినాయక స్వామి దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు చలపతి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.