హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుపాకి పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

NZB: నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకి పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ మృతి చెందారు. ఉదయం తుపాకిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.