SRD: గణేశ్ నవరాత్రుల సందర్భంగా బొల్లారం డివిజన్ బీరప్ప బస్తీలో ఓ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బొల్లారం సీఐ సుధీర్ కుమార్, ఏసీపీ నర్సింహులు మండపాన్ని దర్శించి శిబిరాన్ని ప్రారంభించారు. తలసేమియా బాధితుల కోసం యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతను అధికారులు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
తెలంగాణ
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం


