హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: గిద్దలూరులోని ఒంగోలు రోడ్డులో  ఇవాళ ఉదయం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బేస్తవారిపేట మండలం పెంచికలపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.