హైదరాబాద్: 28°C
క్రైమ్

పాల వ్యాపారి దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ పాల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం పాల వ్యాపారి భుజంగరావు(60) బైక్‌పై వెళ్తుండగా, కొందరు దుండగులు అతన్ని వెంబడించి కత్తితో మెడపై నరికి పారిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. భూవివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.