హైదరాబాద్: 28°C
క్రైమ్

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

TG: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను నిజామాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారు నిజామాబాద్‌కు చెందిన ట్రాన్స్ కో ఉద్యోగులు అని పోలీసులు తెలిపారు.