హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీరు అందక ఎండుతున్న పంటలు

E.G: గోపాలపురం మండలంలో ఎండ తీవ్రత పెరిగి పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేకపోవడంతో చేనులన్నీ ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు సకాలంలో అందక పంటల దిగుబడిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నారు.