హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సై కొట్టారని ఆత్మహత్యాయత్నం

KDP: మైలవరం మండలం బుచ్చంపల్లెకు చెందిన డి. రాజమోహన్ విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వినాయక లడ్డూ వేలంలో ఘర్షణ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్సై కొట్టారని ఆయన తండ్రి రంగనాయకులు ఆరోపించారు. జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేసి, ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.