ప్రకాశం: సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం కూడలిలో కోయంబత్తూర్‌కు చెందిన గోల్డ్‌మెన్ రాజీమాన్ మీథల్ సందడి చేశారు. 2.6 కిలోల బంగారు ఆభరణాలు ధరించిన అతన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం తులం బంగారం కొనడమే కష్టంగా మారిన రోజుల్లో రెండు కిలోలకు పైగా బంగారం ధరించిన వ్యక్తి కనపడటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో గోల్డ్‌మెన్


