హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు జిల్లాగా ప్రకటించాలి: ఉషాశ్రీ చరణ్

సత్యసాయి: జిల్లాలో వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువల లైనింగ్ పనులతో బోర్లు ఎండిపోయి తాగునీటికీ ఇబ్బందులు కలుగుతున్నాయని, కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.