E.G: కడియం మండలం కడియపులంకలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన సివిల్ సప్లై అధికారులు 27 సిలిండర్లను సీజ్ చేశారు. మండల సివిల్ సప్లై అధికారి ప్రభాకర్ గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చింది. బాధ్యులపై 6-ఏ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
27 గ్యాస్ సిలిండర్లు సీజ్


