హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు జాబితా, అభ్యంతరాలు

కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారులు రూపొందించిన ఓటరు జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియపై VCK రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బొంతు రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కమిషనర్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేశారని ఆరోపించారు.