హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పీఠంపై కూటమిలో పోటీ

కోనసీమ: అమలాపురం నియోజకవర్గంలో కీలక పదవుల్లో TDPకి ప్రాధాన్యం దక్కిందని జనసేన నేతలు పేర్కొంటున్నారు. మార్కెట్ కమిటీ, అముడా ఛైర్మన్ పదవులు TDPకి దక్కిన నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ పదవి తమ పార్టీకి ఇవ్వాలని కోరుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో TDPకి 4, జనసేనకు 6 కౌన్సిలర్ స్థానాలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఛైర్మన్ పదవి ఆశతో పలువురు ఎదురుచూస్తున్నారు.