హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

NTR: విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన యువతికి దినేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి పలుమార్లు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.