హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 30 నుంచి కార్మికుల సమ్మె

విశాఖపట్నం జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న పొరుగు సేవల కార్మికులకు బకాయిల చెల్లింపు, హోదా, కేటగిరీ వర్గీకరణపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 30 నుంచి సమ్మె చేయనున్నట్లు జీవీఎంసీ ఒప్పంద ఉద్యోగులు, కార్మికుల సంఘ గౌరవాధ్యక్షుడు ఎం.ఆనందరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.సత్యం తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.