హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎంపీపీ, ఎంపీటీసీలకు వేతనాలు లేవు'

KKD: MPP, MPTCలకు 42 నెలలుగా ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించలేదని సామర్లకోట MPP బొబ్బరాడ సత్తిబాబు ధ్వజమెత్తారు. గురువారం మండల పరిషత్లో విలేకరులతో మాట్లాడారు. MLAలు, MPలు ప్రతినెలా వేతనాలు పొందుతున్నారని, క్షేత్రస్థాయి ప్రతినిధులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వేతనాలు పెంచినట్లు చంద్రబాబు ప్రకటించినా ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.