హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడారంలో ఆశీర్వాద దీపాలు

MLG: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ మహా అభియాన్‌లో భాగంగా గురువారం రాత్రి తాడ్వాయి మండలం మేడారంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజు గద్దెల వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాద దీపాలు వెలిగించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.