హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

HNK: హన్మకొండ రామ్‌నగర్‌లో ఊట్ల రామసుధాకర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడి నిర్వహించారు. ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.6,000 నగదు, 4బైకులు, 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.