NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు దయ్యలగండి వద్ద నీరు ఆకుపచ్చగా మారడంపై అధికారులు ఈ రోజు స్పష్టత ఇచ్చారు. నీటిలో ఎలాంటి రసాయనాలు లేవని, ఎలాంటి కాలుష్యం జరగలేదని హైదరాబాద్ ల్యాబ్ పరీక్షల్లో తేలినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ మల్లిఖార్జునరావు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో సహజంగానే నీటి రంగు మారిందని ఆయన తెలియజేశారు.
తెలంగాణ
నీటి రంగుపై అధికారుల క్లారిటీ


