హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓరుగల్లు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం

WGL: ఓరుగల్లు నగర సమగ్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తుందని ప్రతినిధులు తెలిపారు. (కుడా) సమావేశ మందిరంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. మల్టీ లెవల్ పార్కింగ్, రోప్‌వే, సెంట్రల్ ఫుడ్ ప్లాజా, డ్రైనేజీ, వరద ముంపు నివారణ ప్రాజెక్టులపై చర్చించారు. పట్టణాభివృద్ధికి 300 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వనుందని అధికారులు వెల్లడించారు.