హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నివాస ప్లాట్లు ఈ-వేలం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 459 నివాస ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు నేషనల్ లాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. గాజువాక, ఆటోనగర్, మద్దిలపాలెం, హెచ్‌బీ కాలనీలోని ప్లాట్లు వేలంలో ఉంటాయి. మొత్తం 93,572 చదరపు గజాల భూమి విక్రయానికి అందుబాటులో ఉంది. పెట్టుబడిదారుల సమావేశాలు ఈ నెల 23న విశాఖ, 24న విజయవాడ, 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.