హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురపూడి ఎయిర్పోర్ట్‌లో బుల్లెట్ కలకలం

E.G: రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో బుల్లెట్ లభించడం కలకలం రేపింది. పాలకొల్లుకు చెందిన గెడ్డం ఉజ్వల బ్యాగ్‌ను ఎయిర్పోర్ట్ భద్రత సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్‌ను గుర్తించారు. ప్రాథమికంగా అది AK-47 బుల్లెట్‌గా భావిస్తున్నప్పటికీ పరీక్షల అనంతరం దానిని అధికారికంగా నిర్ధారించనున్నారు. దీనిపై పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.