ELR: నిరుద్యోగ యువతీ, యవకులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ చేపడుతున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నూజివీడ సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. పట్టణంలోని సారథి ఇంజనీరింగ్ కళాశాలలో ఇవాళ ఉదయం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 14 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 1900 ఖాళీలను ఆయా కంపెనీలు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'


