హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ELR: ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చోదిమెళ్ల సాయికృష్ణా నగర్ లో ఈ నెల 5న జరిగిన ఇంటి దొంగతనం కేసులో దర్యాప్తు చేపట్టగా గురువారం స్వాతి పెట్రోల్ బంక్ సమీపంలో మిత్తిరెడ్డి సురేశ్ (30)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.