హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HLC కెనాల్‌లో మృతదేహం లభ్యం

ATP: బొమ్మనహాళ్ మండలం ఉప్పరహాల్‌లో వినాయకుడి నిమజ్జనం రోజు హెచ్‌ఎల్‌సీ కెనాల్‌లో గల్లంతైన సాయిభరత్ మృతదేహం ఎర్రగుంట సమీపంలో లభ్యమైందని ఎస్సై నబీరసూల్ తెలిపారు. 20 గంటల పాటు పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు.