హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌లో గేట్–జామ్ 2027పై అవగాహన

అన్నమయ్య: మదనపల్లె మిట్స్ యూనివర్సిటీలో గేట్–జామ్ 2027 పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ రత్న కుమార్ విద్యార్థులకు పరీక్షల ప్రాధాన్యత, ఉన్నత విద్య, పరిశోధన, కెరీర్ అవకాశాలను వివరించారు. గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులతో క్రమబద్ధంగా సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.