హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరాలు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. శ్రీనివాసులు తెలిపారు. గువ్వలచెరువు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో శిబిరాన్ని ప్రారంభించారు. ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్, ఆరోగ్య పథకాలపై అవగాహన, హెచ్‌పీవీ టీకాలు అందిస్తామని తెలిపారు.