హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిందూ ఉత్సవ సమితికి నగదు వితరణ చేసిన ఎమ్మెల్యే

VKB: తాండూరులోని హిందూ ఉత్సవ కేంద్ర సమితికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిన్న రాత్రి రూ. 3.51 లక్షల నగదును వితరణ చేశారు. ఈ నగదు సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కోసం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.