హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

NLR: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి జరిగిన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోలాట కార్యక్రమంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.