అన్నమయ్య: రాయచోటి మండలంలోని కాటిమాయకుంటకు చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ రెడ్డి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ కూలీలతో సత్సంబంధాలు కలిగి మంచి పేరు పొందారు. ఆయన మృతితో కాటిమాయకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ హఠాన్మరణం


