హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సేతుబంధ సర్వాంగాసనం వల్ల కలిగే లాభాలు

సేతుబంధ సర్వాంగాసనాన్ని వంతెన భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వెన్నెముకను సాగదీసి, వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది. రోజంతా కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పి, వెన్నునొప్పి తగ్గుతాయి. తొడలు, పిరుదుల కండరాలు, కోర్ కండరాలకు వ్యాయామాన్ని అందించి వాటిని బలంగా తయారు చేస్తుంది. పొత్తికడుపులోని అవయవాలు ఉత్తేజితమవ్వడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.