GDWL: రాజోలి మండల కేంద్రంలోని చేనేత కార్మికుడు కుమ్మరి వెంకట్రాముడు (46) గురువారం మధ్యాహ్నం ఛాతి నొప్పితో హఠాన్మరణం చెందారు. పనుల నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన కన్నుమూశారు. 20 రోజుల క్రితమే ఎన్నో ఆశలతో కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలోకి గృహప్రవేశం చేసిన ఆయన, ఇంతలోనే మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
గుండెపోటుతో చేనేత కార్మికుడి మృతి


